![]() |
![]() |

అటు కూతురు.. ఇటు తల్లి ఇద్దరు సోషల్ మీడియాని షేక్ చేస్తుంటారు. వారానికో బోల్డ్ ఫోటో షూట్ వదులుతూ ఇన్ స్టాగ్రామ్ లో మోస్ట్ వైరల్ కంటెంట్ ఇస్తుంటారు. వారే తల్లి సురేఖా వాణి, కూతురు సుప్రిత.
సురేఖా వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో ఆమె నటించింది. సహాయ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తున్నారామె. అయితే, ప్రస్తుతం ఆమెకు అంత గొప్ప పాత్రలైతే రావడం లేదు. అన్నీ చిన్న చిన్న పాత్రలే. నిజానికి సురేఖా వాణి కెరీర్ ప్రారంభమైందే బుల్లితెరపై. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సురేఖకు డైరెక్టర్ సురేష్ తేజ ‘మొగుడ్స్ పెళ్లామ్స్’, ‘హార్ట్ బీట్’ వంటి షోలలో అవకాశం ఇచ్చారు. వీటితో ఆమె పాపులర్ అయ్యింది.
ఇక తాజాగా బీచ్ ఒడ్డున బ్లాక్ కలర్ లాంగ్ బికినీతో ఫోజులిచ్చింది సురేఖా వాణి. ఆ ఫోటలతో ఓ వీడియో క్లిప్ ని ఎడిట్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆయితే ఆ డ్రెస్ లో సురేఖా వాణిని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ కామెంట్ల కంటే నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో కుర్రాళ్ళకి మతిపోగెట్టేలా చేస్తుంది.
![]() |
![]() |